ఆర్ఎక్స్ 100 – కాస్త స్లోగా వెళ్లినా బాగానే నడుస్తోంది

విడుదల తేదీ : జులై 12, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 4/4
నటీనటులు : కార్తికేయ, పాయల్ రాజపుత్‌, రావు రమేష్
దర్శకత్వం : అజయ్ భూపతి
నిర్మాత : అశోక్ రెడ్డి గుమ్మకొండ
సంగీతం : చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫర్ : రామ్
ఎడిటర్ : ప్రవీణ్. కే .ఎల్
స్క్రీన్ ప్లే : అజయ్ భూపతి

టాలీవుడ్‌లో చిన్న చిత్రాలకు, విభిన్నమైన కథాంశంతో రూపొందే చిత్రాలకు ప్రేక్షకుల విశేష ఆదరణ లభించిన దాఖలాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే ఉన్నాయి. పెద్ద హీరో, భారీ బడ్జెట్ చిత్రాలనే తేడా లేకుండా కంటెంట్ ఉండే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు సాక్ష్యంగా పెళ్లిచూపులు, మెంటల్ మదిలో, అర్జున్ రెడ్డి చిత్రాలు సాక్ష్యంగా నిలిచాయి. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన చిత్రం RX 100. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో, హీరోయిన్లుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను సొంత చేసుకొన్న ఈచిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకొన్నదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే

శివ (కార్తికేయ) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే, డాడి(రాంకీ) అన్ని తానై శివను పెంచుతాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. కాగా ఇందు (పాయల్ రాజపుత్‌) శివను చూడగానే ఇష్టపడుతుంది. కావాలని అతన్ని టీజ్ చేస్తూ వెంట పడుతూ శివని ప్రేమలో దింపుతుంది. ఇద్దరు ఫిజికల్ గా దగ్గరవుతారు. అలా ఇందు మాటలకి చేతలకి శివ ఇంకా డీప్ ప్రేమలోకి వెళ్తాడు. పెళ్లి చేసుకుందాం అని ఇందుని ఫోర్స్ చేయగా.. ఇందు మా నాన్న(రావు రమేష్)కి చెప్పి ఒప్పిస్తానని వెళ్తుంది. కట్ చేస్తే రావు రమేష్ ఇందుకి పెళ్లి చేసి అమెరికా పంపించేశాడని శివకు తెలుస్తోంది. ఇక శివ తాగుతూ ప్రేమ పిచ్చోడిలా ఇందు కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. .

ఆ క్రమంలో ఇందుకు పెళ్లి చేసింది రావు రమేష్ కాదని తెలుస్తోంది. అసలు ఇందు, మహేష్ అనే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది ?.శివని అంతలా ప్రేమించిన ఇందు ఎందుకు అతనికి కనబడకుండా తిరుగుతుంది ? ప్రేమ కోసం రోజురోజుకి పిచ్చోడిలా అయిపోతున్న శివను మార్చటానికి డాడి (రాంకీ) ఏం చేశాడు ? అసలు మళ్ళీ శివ,ఇందు కలుసుకుంటారా ? చివరకి శివ ఏమైపోతాడు ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ‘ఆర్ఎక్స్ 100’ సినిమా చూడాల్సిదే

ఫస్టాఫ్ అనాలిసిస్ శివ దూకుడు తనంతో ఉండే క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడంతో ఆర్ఎక్స్ 100 చిత్ర కథ మొదలవుతుంది. శివ ఆవేశాన్ని డాడీ కంట్రోల్ చేయడం, అలాగే విశ్వనాథం ఎన్నికల్లో గెలుపొందడం లాంటి అంశాలను పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి చక్కగా ఉపయోగించుకొన్నాడు. చాలా సౌమ్యంగా ఉండే శివ అగ్రెసివ్‌గా మారడానికి గల కారణాలను ఫ్యాష్ బ్యాక్‌తో మొదలుపెడుతాడు. ఇందు ఎంట్రీతో తొలిభాగం నాటు రొమాన్స్‌తో వేడెక్కుతుంది. యూత్‌లో జోష్ పెంచే విధంగా లిప్‌లాక్‌లతో సన్నివేశాల్లో కాకపుడుతుంది. ఇలా సాగుతున్న సినిమాకు ఓ మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

సెకండాఫ్ అనాలిసిస్ సెకండాఫ్‌లో కథ ప్రేక్షకుడు ఊహించని విధంగా మరోస్థాయికి వెళ్తుంది. సన్నివేశానికి, సన్నివేశానికి మధ్య వేగం పెరిగి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. క్లైమాక్స్‌లో సాధారణంగా ఊహించిన దాని కన్నా అనేక ట్విస్టులు తెర మీద ఆవిష్కృతం కావడంతో ఆడియెన్స్‌ థ్రిల్‌గా ఫీలవుతారు. కార్తీ, పాయల్, రావు రమేష్, రాంకీ పవర్ ప్యాక్ ఫెర్మార్మెన్స్‌తో క్లైమాక్స్‌ అదిరిపోతుంది. ఒక ఎమోషనల్ ఎండింగ్‌తో సినిమా అద్భుతమైన నోట్‌తో ముగుస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

మొదటి సారి హీరోగా నటించిన కార్తికేయ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. పైగా తన సిక్స్ ప్యాక్ తో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా హీరోయిన్ గురించి అసలు విషయం తెలుసుకున్న సన్నివేశంలో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని కార్తికేయ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా బాగా నటించాడు

శివగా జీవించిన కార్తీకేయ ఆర్ ఎక్స్ 100 చిత్రం హీరో కార్తీకేయకు తొలి పరిచయం. శివ క్యారెక్టర్‌లో కార్తీకేయ చూపిన వేరియేషన్స్ ఇటీవల కాలంలో మరే హీరోకు దక్కలేదని చెప్పవచ్చు. అమాయకుడిగా, ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, అన్యాయానికి గురైన యువకుడిగా, ప్రియురాలి మోసానికి గురై ఆవేదన చెందే ప్రియుడిగా ఇలా ఎన్నో షేడ్స్‌ను ఆ క్యారెక్టర్‌లో చూడవచ్చు. ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌లోను బాగా రాణించాడు. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ఇరుగదీశాడు. కార్తీకేయ రూపంలో టాలీవుడ్‌కు మరో ప్రతిభావంతుడైన హీరో లభించాడనే చెప్పవచ్చు. సరైనా పాత్రలను ఎంపిక చేసుకుంటే మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంది.

గ్లామర్‌తో అదరగొట్టిన పాయల్ పాయల్ రాజ్‌పుత్ పోషించిన ఇందు పాత్ర ఈ మధ్య తెలుగు సినిమాల్లో చూసి ఉండకపోవచ్చు. హీరోయిన్లు పాటలకు, అందాల ఆరబోతకే పరిమితవుతున్నారనే విమర్శకు చెక్ పెట్టే విధంగా ఇందు పాత్రను దర్శకుడు రూపొందించారు. క్యారెక్టర్‌కు తగినట్టే పాయల్ ఆ పాత్రలో జీవించింది. తొలిభాగంలో రొమాంటిక్ సన్నివేశాల్లోనూ డామినేట్ చేసింది. అలాగే సెకండాఫ్‌లో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందనే చెప్పవచ్చు. క్లైమాక్స్‌లో పాయల్ చూపించిన హావభావాలు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగిస్తాయి.

రావు రమేశ్ పవర్ ఫుల్‌గా ఆర్ ఎక్స్ 100 చిత్రంలో రావు రమేస్ మరోసారి చక్కటి పాత్రను పోషించారు. తొలి భాగంలో విశ్వనాథం పాత్రలో నెగిటివ్ షేడ్స్ కనిపించినప్పటికి.. సెకండాఫ్‌లో ఆయన పాత్రను మలిచిన తీరు, ఆ పాత్రలో రావు రమేష్ జీవించిన తీరు ఆడియెన్స్‌ను కట్టిపడేస్తుంది. ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన ఆయనకు విశ్వనాథం ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే పాత్ర అని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో రావు రమేష్ నటన అమోఘం అని చెప్పవచ్చు.

ఆర్ ఎక్స్ 100 కథలో ట్విస్టులు ఇందూకు పెళ్లి అయిందని తెలిసినా ఆమె జ్హాపకాల్లోనే ఎందుకు బతికాడు. ఇందు కోసం మూడేళ్లు ఎదురు చూసిన శివకు ఆమె ప్రేమ దక్కిందా? ఇష్టంగా ప్రేమించిన శివను ఇందు ఎందుకు దూరం చేసుకొన్నది? చివర్లో ఊహించని విధంగా ఇందు గురించి శివ ఓ విషయాన్ని తెలుసుకొంటుంది. ఆ ట్విస్టు వల్ల సినిమా క్లైమాక్స్‌ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే RX 100 చిత్ర కథ.
మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో కథాంశం బాగున్నా అంతే స్థాయిలో ఉండాల్సిన కథనం మాత్రం ఆ స్థాయిలో ఉండదు. అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలు ఎక్కువైపోయాయి. పైగా సెకండాఫ్ కొంత ల్యాగ్ అనిపించి అక్కడక్కడ బోర్ కొడుతుంది.

కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాలతో, ప్రేమ కోసం పిచ్చోడిలా తిరుగుతున్న హీరో ఏం అయిపోతాడో అనే ఒక పెయిన్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు అజయ్ భూపతి. ఆ కంటెంట్ ను అంతే గొప్పగా ఎలివేట్ చేయలేకపోయారు. ఆయన సెకండాఫ్ పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు అజయ్ భూపతి మంచి స్టోరీ ఐడియా, ప్లాట్ ను తీసుకున్నా దాన్ని అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే బాగుండేది.
సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన పాటల సంగీతం ఆకట్టుకుంటుంది. స్మరన్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకే హైలెట్ నిలుస్తోంది. విషయం లేని సీన్ లో కూడా ఆయన తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆడియన్స్ లో ఊపు తీసుకొచ్చారు.
రియల్ సతీష్ సమకూర్చిన స్టంట్స్ కూడా బాగున్నాయి. ప్రవీణ్. కే .ఎల్ ఎడిటింగ్ బాగుంది. కాకపోతే సెకండాఫ్ లో ఆయన కత్తెరకి ఇంకొంచెం పని చెప్పి ఉండాలసింది. రామ్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది.పెల్లెటూరి విజువల్స్ ను ఆయన చాలా బాగా చూపించారు. నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా

కార్తికేయ హీరోగా చేసిన ఈ తొలి ప్రయత్నం ఆయనకు మంచి ఫలితాన్నే ఇస్తుంది. సినిమాలో నటనతో, డ్యాన్సులతో, ఫైట్స్ తో కార్తికేయ నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకుడు అజేయ్ భూపతి రాసిన కొన్ని ఎమోషనల్ సీన్స్, కూతురితో రావు రమేష్ మాట్లాడే సన్నివేశం ఇలా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కానీ సెకండాఫ్,సాగతీతతో విసుగు తెప్పిస్తుంది. పైగా సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడ కరువైంది. మొత్తం మీద ఈ ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ను ఆశించే వాళ్ళను నిరాశ పరుస్తోంది. ఓ డిఫరెంట్ జోనర్ లో సినిమాను చూద్దామనే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చుతుంది