‘ఆర్‌ఎక్స్100’ సినిమాలో హీరోయిన్ : చేసిందిఏంటి ?

ఇటీవలే విడుదలైన ‘ఆర్‌ఎక్స్100’ సినిమాలో హీరోయిన్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీజర్, ట్రైలర్‌లతోనే యువతలో ఆత్రుత పుట్టించిన ఈ సినిమా విడుదలయ్యాక మరింత క్రేజ్ కొట్టేసింది. విడుదలైన తొలిరోజే దాదాపు సినిమాకు పెట్టిన ఖర్చంతా రాబట్టిన ‘ఆర్‌ఎక్స్100’ రోజు రోజుకూ స్పీడ్ పెంచుతోంది. హీరో హీరోయిన్లు కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌ల మధ్య షూట్ చేసిన పలు సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక స్పెషల్‌గా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ గురించి మాట్లాడుకుంటే.. తన అందచందాలతో యువ హృదయాలను మత్తెక్కించేసింది పాయల్. సినిమాలో ఆమెది బోల్డ్ క్యారెక్టర్ పైగా నెగెటివ్ రోల్.. కోరికతో రగిలిపోతున్న ఆమె.. లోలోపలే కుట్రలు చేయడం చూసి ప్రేక్షక లోకం కొత్తగా ఫీల్ అయ్యారు. చిత్రంలో లిప్‌లాక్ సీన్స్‌కి లెక్కే లేదు. ఒకరకంగా చెప్పాలంటే సినిమాకి పాయల్ రాజ్‌పుతే స్పెషల్ అట్రాక్షన్ అయింది.

అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. సినిమాలో నటించేందుకు గాను పాయల్ తీసుకుంది కేవలం 6 లక్షలు మాత్రమేనట. అంత తక్కువ పారితోషికం తీసుకున్న ఈ బ్యూటీ కెమెరా ముందు అందాల ఆరబోతలో మాత్రం వెనకాడలేదు. పైగా తొలి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో రుజువు చేసింది. దీంతో ఈమెకు టాలీవుడ్ అవకాశాలు వరుసపెట్టి రావడం ఖాయం అనే టాక్ మొదలైంది జనాల్లో.

Leave a Reply