ఉపాధ్యాయుల కి నేను అండగా వుంటా గిరిజనఎమ్మెల్యే,

ఉపాధ్యాయుల సమస్యలను ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. అనకాపల్లి పట్టణంలోని ఏపీటీఎఫ్‌ కోలపర్తి అప్పారావు ఉపాధ్యాయ భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల బాధ్యతగా పోరాటాలు, ఉద్యమాలు చేయడం ద్వారా సమస్యల కృషి చేస్తుంటారన్నారు. తాను ఎమ్మెల్యే అయినా గతంలో ఉపాధ్యాయురాలిగా, ఏపీటీఎఫ్‌ సంఘంలో రాష్ట్రస్థాయి బాధ్యతలు నిర్వహించినందున ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటానన్నారు. మీ పోరాటాలకు మద్దతు ఉంటుందన్నారు. అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కూడా సుముఖంగానే ఉందన్నారు.