ఎవరూ ఊహించని రేంజ్‌లో కలెక్షన్స్ ;మహానటి

ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎవరూ ఊహించని రేంజ్‌లో వసూళ్లు సాధించిన ఈ మూవీ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు వందశాతం లాభాలు తెచ్చిపెప్పింది. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 50 రోజుల్లో రూ. 78 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సినిమా విడుదలైన తొలి రోజు నుండే సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఊహించిన దానికంటే ఎక్కువ వసూలు చేయడంతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతి బ్యానర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

అన్ని సినిమాలను వెనక్కి నెట్టి ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు రానంత అప్లాజ్, గొప్ప సినిమా అనే పేరు మహనటి సినిమా సొంతం చేసుకుంది. కొన్ని పెద్ద హీరోల సినిమాలతో క్లాష్ అయినా ఏ మాత్రం తగ్గకుండా వాటినే వెనక్కి నెట్టేసి టాప్ చార్టులో నిలుస్తూ వచ్చింది ‘మహానటి’ బయోపిక్.

తక్కువ బడ్జెట్… ‘మహానటి’ చిత్రాన్ని కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా రూ. 78 కోట్ల షేర్ వసూలు చేయగా అందులో రూ. 42 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. దీంతో సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు వందశాతం లాభాలు వచ్చాయి

ఓవర్సీస్‌లో వసూళ్లు అదుర్స్ ఓవర్సీస్ మార్కెట్లో కూడా మహానటి చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ ఈ చిత్రం రూ. 10.55 కోట్లు రాబట్టింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.45 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ. 42.65 కోట్లు రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో టాప్ నైజాం తెలుగు రాష్ట్రాల్లో
‘మహానటి’ చిత్రం మొత్తం రూ. 28.65 కోట్ల షేర్ వసూలు చేసింది.
రూ. 11.79 కోట్లతో నైజాం టాప్ పొజిషన్లో ఉండగా
సీడెడ్ రూ. 2.98 కోట్లు, వైజాగ్ రూ. 4.01 కోట్లు,
ఈస్ట్ రూ. 2.50 కోట్లు, వెస్ట్ రూ. 1.64 కోట్లు,
కృష్ణ రూ. 2.49 కోట్లు, గుంటూరు రూ. 2.13 కోట్ల వసూలైంది.