గిరిజనులబాధలు తెలుసుకొంటున్న రేపటి సీఎం :పవన్ కళ్యాణ్


బాక్సైట్‌ పోరాటంలో గిరిజనులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలం గాలికొండ వ్యూ పాయింట్‌ నుంచి బాక్సైట్‌ కొండను మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రకృతికి విఘాతం కల్గించే పనులకు పాల్పడితే సహించేది లేదని, గిరిజనులకు అండగా పోరాటం చేస్తామని తెలిపారు.

అనంతరం ఎగుశోభ పంచాయతీ భీసుపురం గ్రామంలో గిరిజనులతో ముఖముఖి మాట్లాడారు. హుద్‌హుద్‌ తుపాను సాయం చాలా మందికి అందలేదని గిరిజనులు ఆయనకు వివరించారు. బాక్సైట్‌ తీయడం వల్ల సుమారు 300 గ్రామాల గిరిజనులకు అన్యాయం జరుగుతుందని, బాక్సైట్‌ తీసేందుకు ఇచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయించేలా చూడాలని కోరారు. బాక్సైట్‌పై గిరిజనులు పోరాటం సాగించాలని.. అండగా నిలబతామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

ఆంత్రాక్స్‌ బాధితులకు పరామర్శ
కునిడి, పోతంగి, తోటవలస, కొత్తవలస గిరిజన గ్రామాలను సందర్శించిన పవన్‌కల్యాణ్‌.. పోతంగిలో ఆంత్రాక్స్‌ బాధితులను పరామర్శించారు. గిరిజన ప్రాంతంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని, గిరిజన మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. డుంబ్రిగుడలోని కస్తూర్బాగాం«ధీ బాలికల పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

Leave a Reply