చైతూ విషయంలో సమంత ఎంత పొసెసివ్‌గా ఉందో కదూ…

టాలీవుడ్‌లో లవ్లీ కపుల్ ఎవరు? అని అడిగితే… చాలామంది ‘చై-సామ్’ అంటూ నాగ చైతన్య, సమంత జంట గురించి చెబుతుంటారు. వీళ్లిద్దరి అన్యోన్యత, లవ్ స్టోరీ, పెళ్ళి ఓ రొమాంటిక్ మూవీని తలపిస్తుంది. అంతా బాగానే ఉంది గానీ, ఇటీవల హైదరాబాదులోని ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమంతను తన భర్త చైతూకి ఇష్టమైన ఫుడ్ గురించి అడిగినప్పుడు తను ఇచ్చిన రియాక్షన్ అక్కడున్నవారందరికీ షాకిచ్చింది. తనకు ఇష్టమైన ఫుడ్ హైదరాబాదీ బిర్యానీ అని బదులిచ్చిన సమంతను తన హబ్బీ చైతూకి ఏదిష్టమో చెప్పమంటే మాత్రం చెప్పకుండా వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయింది. తనకే స్వంతమైన తన భర్త గురించి ఎవరైనా పర్సనల్ క్వశ్చన్స్ అడగటం సమంతకు ఇష్టంలేదేమోనని అంతా అనుకున్నారు. చైతూ తనకే సొంతమని, తన భర్త, తమ ఫ్యామిలీకి సంబంధించి వేసే ప్రశ్నలు ఏవైనా సరే… వాటికి జవాబివ్వకూడదని, పాజిటివ్ అయినప్పటికీ తన కుటుంబ విషయాలు బయటపెట్టకూడదని తను నిర్ణయించుకుందేమో! చైతూ విషయంలో సమంత ఎంత పొసెసివ్‌గా ఉందో కదూ…

Leave a Reply