నాకేమో పోజులివ్వడం రాదు.

సెలెక్ట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంపికైన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. తాను ఇంటర్ మీడియట్ చదివే రోజుల్లో.. జగదీశ్ మార్కెట్‌లో సెకండ్ హ్యాండ్ ఆల్కాటెల్ ఫోన్ కొన్నానని.. అదే తన మొదటి మొబైల్ అని తెలిపారు.

‘ఫోన్ ఎక్కువగా వాడతారా? సెల్ఫీలు బాగా దిగుతారా?’ అని మీడియా ప్రశ్నించగా ఆసక్తికర సమాధానమిచ్చారు ఎన్టీఆర్. ‘‘ప్రపంచం మారిపోయింది. ఏమీ లేకున్నా సరదాగా ఫోన్ తీసి చూస్తున్నాం. నేను కూడా అంతే. అసలు ఫొటోలే దిగను. నాకు పోజ్ ఇవ్వడం నచ్చదు. అదంటే నాకు వణుకు వస్తుంది. నా భార్య కూడా నా ఫొటోలు తీస్తానని అంటుంది. కానీ, నాకేమో పోజులివ్వడం రాదు..’ అని చెప్పుకొచ్చాడు.

Leave a Reply