నీవెవరో…..?

ఇటీవలే ‘రంగస్థలం’లో కుమార్ బాబుగా.. తన నటనలోని ప్రతిభ చూపించి అదరగొట్టాడు ఆది పినిశెట్టి. ఈ సినిమా తర్వాత ఆయన హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘నీవెవరో’. తాప్సీ, రితికా సింగ్‌ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రాన్ని కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.

‘రెండు ప్రేమకథలు.. ఒక్క సంఘటన’ అంటూ ఆది వాయిస్ ఓవర్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. టీజర్‌ని బట్టి చూస్తే మూవీ రొమాంటిక్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. ‘ఈ ప్రపంచంలో ప్రతీ సమస్యకు సమాధానం.. ఏదో ఒక రూపంలో వస్తుంది. నాకే రూపంలో వస్తుందో చూడాలి’ అని ఆది చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ‘మీరు స్కెచ్ వేసి చంపింది అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్.. నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్.. కిమ్మైనా.. ట్రంపైనా లోపలేసి కుమ్ముతా’ అంటూ వెన్నెల కిషోర్ పండించే కామెడీ ఆకట్టుకుంది. టోటల్‌గా ప్రేక్షకుడి మనసుకు హత్తుకునేలా.. ఇంటెలిజెంట్‌గా టీజర్‌ని డిజైన్ చేసి వదిలింది చిత్రబృందం.

Leave a Reply