పవన్ కళ్యాణ్ అన్న నువ్వు దేవుడివిఅంటున్నకుటుంబం ని గొప్పమనస్సుకి జోహార్ అంటున్న అభిమానం :

రుషికొండ ప్రాంతంలోని రిసార్ట్స్‌లో ఆదివారం జనసేన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశాఖ జిల్లా మాకవరపాలెం ప్రాంతంలో ఫ్లెక్సీలు కడుతూ ఇటీవల దుర్మరణం చెందిన జనసైనికులు బి.శివ, టి.నాగరాజు కుటుంబ సభ్యులకు జనసేన తరఫున పవన్‌కల్యాణ్‌ చెరో రూ.3 లక్షల చెక్కులను అందజేశారు. ఫ్లెక్సీలు కడుతూ వీరు మరణించడం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. వారి కుటుంబసభ్యులను అక్కున చేర్చుకుని ఆప్యాయంగా పలకరించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబీకుల కోరిక మేరకు శివ కుమారుడికి అనిరుధ్‌, నాగరాజు కుమారుడికి గౌరీశంకర్‌ అని ఆయన నామకరణం చేశారు. జనసేనలో మహిళా విభాగానికి వీరమహిళ అని నామకరణం చేశామన్నారు. ఆడపడుచుల అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకునేందుకు విశాఖలో త్వరలో ఆత్మీయ సంభాషణ కార్యక్రమం, జనసేన మహిళా ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేయాలని జనసేన విశాఖ విభాగానికి సూచించారు. తుమ్మపాల చక్కెర కర్మాగారంపై ఆధారపడి ఎందరో జీవిస్తున్నారని ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ మూతపడి సంబంధిత కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిరు భీమవరపు శివ కుటుంబానికి రూ.3 లక్షలు, భీమవరపు చిన్నా కుటుంబానికి రూ.2.50 లక్షలు, వారి పిల్లల చదువు కోసం రూ.1 లక్షల చెక్కును పవన్‌కల్యాణ్‌ అందించారు. తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకొనేందుకు కార్మికుల సంఘం ప్రతినిధులకు రూ.2.5 లక్షల చెక్కును ఆయన అందించారు. తర్వాత మృతుల చిన్నపిల్లలకు కార్యకర్తల సమక్షంలో పవన్‌కల్యాణ్‌ పేర్లు పెట్టారు. . తెదేపా ప్రభుత్వం విశాఖలో భూములను అమ్మేసుకుంటోందని ఆరోపించారు. వాస్తవాలు తెలియజేస్తున్న తనకు ఎన్నో బెదిరింపులు వస్తున్నా..ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.