ఆగస్టులో ‘బ్రాండ్ బాబు

మారుతి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ శైలేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై యాంకర్ ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌. శైలేంద్ర‌బాబు నిర్మిస్తోన్న చిత్రం ‘బ్రాండ్ బాబు’. డైరెక్టర్ మారుతి కథ అందించిన ఈ మూవీలో సుమంత్ శైలేంద్ర‌, ఈషా రెబ్బా, పూజిత వ‌న్నోడ హీరో హీరోయిన్లుగా నటించారు. ముర‌ళీశ‌ర్మ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.

ఇటీవలే డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌ విడుదల చేసిన ‘బ్రాండ్ బాబు’ టీజర్‌కి మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అతి త్వరలో చిత్ర ఆడియో విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు మొదటివారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మారుతి స్టైల్‌లో హీరో క్యారెక్టరైజేషన్ ఉండబోతోంది. పలు అంశాలను మేళవిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ ప్రభాకర్.

Leave a Reply