బడా ప్రొడ్యూసర్.మరో మల్టీస్టారర్‌కీ శ్రీకారం

టాలీవుడ్‌లో ఇటీవల వరుస మల్టీస్టారర్స్‌ను నిర్మిస్తున్న ఆ బడా ప్రొడ్యూసర్.. త్వరలో మరో మల్టీస్టారర్‌కీ శ్రీకారం చుట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇద్దరు హీరోల్ని సంప్రదించాడట.

గత కొంతకాలం నుంచీ టాలీవుడ్‌లో మళ్లీ మల్టీస్టారర్స్ ఊపందుకున్నాయి. సీనియర్ హీరోలు, యంగ్ హీరోల కలయికలో ప్రస్తుతం కొన్ని మల్టీస్టారర్స్ తెరకెక్కనుండగా.. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు వరుసగా మల్టీస్టారర్స్ మీద ఫోకస్ పెడుతున్నాడు. మహేశ్ బాబు- అల్లరి నరేశ్, వెంకీ -వరుణ్ తేజ సినిమాలతో పాటు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో మరో మల్టీస్టారర్‌కీ దిల్ రాజు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా కోసం దిల్ రాజు ఓ ఇద్దరు యంగ్ హీరోల్ని సంప్రదించనుండడం విశేషంగా మారింది.

‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో టాలీవుడ్‌కు మళ్ళీ మల్టీస్టారర్ వైభవం తెచ్చిపెట్టాడు దిల్ రాజు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ స్ఫూర్తితో మరికొన్ని మల్టీస్టారర్స్ టాలీవుడ్‌లో ఊపిరిపోసుకున్నాయి. ఇక ఇప్పుడు దిల్ రాజు మరికొన్ని మల్టీస్టారర్స్‌పై దృష్టిపెట్టడంతో మరికొందరు ప్రముఖ హీరోలు దిల్ రాజు కాంపౌండ్ లోకి అడుగుపెడుతున్నారు. ఆల్రెడీ మహేశ్ బాబు సినిమాలో అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషిస్తుండగా, వెంకటేశ్ , వరుణ్ తేజ కలయకలో అనిల్ రావిపూడి ‘F2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అలాగే ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో మరో మల్టీస్టారర్‌కు ప్రస్తుతం దిల్ రాజు సంస్థానంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం నానీ, శర్వానంద్‌లను హీరోలుగా ఎంపిక చేయనున్నారని సమాచారం.

యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ఇంద్రగంటి మోహన్ కృష్ణ తనదైన శైలిలో రూపొందించనున్నాడు. దిల్ రాజు ఇప్పటివరకూ కుటుంబ కథాచిత్రాలనే ఎక్కువగా తెరకెక్కించినా ‘ఎవడు’ లాంటి యాక్షన్ చిత్రాల్నీ నిర్మించాడు. ఈ నేపథ్యంలో నానీ, శర్వానంద్ చిత్రం మీద జనంలో ఆసక్తి మొదలైంది. మరి దిల్ రాజు ఈ సారి ఈ సినిమాను ఏ స్థాయిలో నిర్మించి .. ఆకట్టుకుంటాడో చూడాలి.

Leave a Reply