మళ్లీ పవన్‌ను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి

పవన్‌ కళ్యాణ్‌పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి నిప్పులు చెరిగారు. పదహారేళ్లు పెంచుకున్న పాపని కాంగ్రెస్‌ నాయకులు మోసపూరితంగా ఢిల్లీలో జాతీయ చానెళ్ల ఎదుట కూర్చోబెడితే మా కడుపు ఉడికిపోయిందన్న పవన్‌ కళ్యాణ్‌..మరి మీ అన్న ఇంకా కాంగ్రెస్‌లోనే ఎందుకు కొనసాగుతున్నారు.

ఓట్ల కోసం ఆయన అభిమానుల ద్వారా మీకు ఎలా సాయపడుతున్నారని నిలదీశారు. దీనిపై మీ అన్న సిగ్గుపడటం లేదా..? అన్నం పెట్టేవాడికి సున్నం వేస్తారా..? అంటూ శ్రీరెడ్డి మెగా బ్రదర్స్‌ను టార్గెట్‌ చేశారు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ప్రేమ వివాహం సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు తమ బిడ్డను బజారుకీడ్చారంటూ పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా, కాస్టింగ్‌ కౌచ్‌పై శ్రీరెడ్డి వరుస ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.