మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టు కెప్టెన్ అంటున్న: బీసీసీఐ

టీం ఇండియా వికెట్‌-కీపర్ బ్యాట్స్‌మెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్‌మెంట్ గురించి విపరీతంగా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ మరో సంచలనానికి తెర లేపింది. మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టు కెప్టెన్ అంటూ బీసీసీఐ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీంతో పాటు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్లేయర్ బయోడేటాలో అతని గురించి ఎటువంటి వివరణ లేకపోవడం గమనార్హం. దీంతో ఇప్పుడు నెటిజన్లు దీన్ని స్క్రీన్‌షాట్ తీసి ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లో తెగ షేర్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం కాస్త వైరల్ అయింది. బీసీసీఐ వెబ్‌సైట్ నిర్వాహకులు పొరపాటున ధోనీని కెప్టెన్‌గా పేర్కొన్నారా..? లేక బీసీసీఐ నిజంగా అతనికి తిరిగి పగ్గాలు అప్పగించిందా..? అని నెటిజన్లు తెగ తికమకపడిపోతున్నారు. మరి ఈ ఘటనపై బీసీసీఐ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే..