రష్మి ఏం చెప్పిందంటే…?

ప్రముఖ యాంకర్‌, హీరోయిన్‌ రష్మీ గౌతమ్‌ వయసెంతో తెలుసా? అటు ఇటుగా ఇంతని ఆవిడ ఎప్పుడూ చెప్పలేదు. గతేడాది ఓ బుల్లితెర కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిప్పుడు 38 ఏళ్లని నవ్వుతూ చెప్పారు. ఆ లెక్కన ఇప్పుడు ఒకటి తక్కువ నలభై అనుకోవాలి. కానీ, ఆమె అందాన్ని చూస్తే అంత వయసున్నట్టు కనిపించదు. కానీ, ప్రేక్షకులకు ఆమె వ్యక్తిగత జీవితంలోని విషయాలు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి. ఆ ఆసక్తితో ఇటీవల ఓ నెటిజన్‌ ‘అనసూయ కుటుంబంతో మీరు ఎక్కువగా పార్టీల్లో కనిపిస్తుంటారు. త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు లేవా?’ అని ట్విట్టర్‌లో అడిగాడు. అందుకు ఆమె ఏం సమాధానం చెప్పారో తెలుసా? ‘వివాహం… నా వ్యక్తిగత విషయం’ అని! ఓ వైపు బుల్లితెరపై వ్యాఖ్యాతగా చేస్తున్న రష్మీ, వెండితెరపై కథానాయికగానూ కొనసాగుతున్నారు. ‘అంతకు మించి’ అని ఓ హారర్‌ కామెడీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు

Leave a Reply