శ్రీరెడ్డి మల్లి మొదలెట్టాన్నిది ఈసారి తమిళ్ స్టార్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ కొంతకాలం పాటు ప్రకంపనలు రేపిన నటి శ్రీరెడ్డి.. ఫేస్‌బుక్‌లో శ్రీ లీక్స్ అంటూ తనకు గుర్తొచ్చినప్పుడల్లా.. ఏదో ఒక పోస్ట్ పెట్టి సంచలనం రేపుతోంది. తాజాగా తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ కొరియోగ్రాఫర్‌‌గా, దర్శకుడిగా, హీరోగా రాణిస్తున్న ఓ ప్రముఖుడి గురించి తన ఫేస్‌బుక్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది.
‘‘నేను కొందరు ఫ్రెండ్స్ ద్వారా ఆయన్ని హైదరాబాదులో మాసబ్‌ట్యాంక్ వద్ద గల హోటల్ గోల్కొండ లాబీలో కలిశాను. ఆయన నన్ను తన రూమ్‌కి తీసుకెళ్లాడు. నేను ఆ రూమ్‌లోకి ప్రవేశించగానే ఒక స్వామివారి ఫోటో, రుద్రాక్షలు చూశాను. నేను ఆశ్చర్యపోయాను. తరువాత తాను ఓ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చానని.. తాను కొత్తగా వచ్చేవారికి సాయం చేయాలని బావిస్తున్నానని చెప్పడంతో నేను ఆయన్ను నమ్మడం మొదలు పెట్టాను. చాలా మంది పేదవారికి, పిల్లలకు షెల్టర్ ఇస్తున్నట్టుగా ఆయన నాకు చెప్పారు. దీంతో నేను ఇంప్రెస్ అయ్యాను. కానీ తరువాత తన అసలు రంగును చూపించడం మొదలు పెట్టారు. తరువాత ఆయన తనను వాడుకున్నారని (రాయలేని పదజాలాన్ని వాడింది) తెలిపింది. ఆ తర్వాత వెంటనే ఆయన నాకు ఆఫర్ కన్ఫర్మ్ అయిందని తెలిపారు. కానీ చివరికి ఇది బాధాకరంగా ముగిసింది. నేను ఆయనతో నా స్నేహాన్ని కంటిన్యూ చేశాను. కానీ దీనిలో ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి విలన్‌గా మారారు’’ అంటూ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది.