సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందా? ? ?

నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సమంత సినిమాల్లో కంటిన్యూ అవ్వడంపై అప్పట్లో చాలా మందిలో అనేక సందేహాలు ఏర్పడ్డాయి. పెళ్లైన హీరోయిన్లకు సినిమాలు వర్కౌట్ అవుతాయా? మ్యారీడ్ బ్యూటీలను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? అనే విమర్శలను పటాపంచలు చేస్తూ….. రంగస్థలం, మహానటి, తమిళంలో విశాల్‌తో ‘ఇరుంబు తిరై’ చిత్రాలతో వరుస విజయాలు అందుకుని హ్యాట్రిక్ నమోదు చేసింది ఈ చెన్నై బ్యూటీ. అయితే త్వరలో సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాలకు దూరం కాబోతోందా? 2017లో చైతన్యను పెళ్లాడిన సమంత… పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందంటూ తాజాగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత సమంత ప్రస్తుతం తన చేతిలో ఉన్న సీమరాజా, సూపర్ డిలక్స్, యూ టర్న్ ప్రాజెక్టులను మార్చి 2019లోగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉందని, ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటోందని టాక్.

కారణం అదేనా? ఇంతకు ముందు సమంత ఓ ఇంటర్వ్యూలో … పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలను వదిలేస్తానని చెప్పడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తోంది. చైతు-సామ్ దంపతులు త్వరలో పిల్లలను కనాలని ప్లాన్ చేసుకుంటున్నారని, అందకే సమంత సినిమాలకు దూరం అవ్వాలనుకుంటోందని చర్చించుకుంటున్నారు.

అందుకే ఈ నిర్ణయం గత ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ… ‘పిల్లలు పుట్టిన తర్వాత వారే నా ప్రపంచం అవుతారు. వర్కింగ్ ఉమెన్ అంటే నాకు గొప్ప గౌరవం ఉంది. కానీ నా చిన్నతనం ఏమంత అందంగా సాగలేదు. తమ చిన్నతనం ఆందంగా, ఆనందంగా సాగలేదని భావించే పెద్దలెవరైతే ఉంటారో… వారు తమ పిల్లలకు తాము మిస్సైన దాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. నేను కూడా నా పిల్లలకు అందమైన చైల్డ్ హుడ్ ఇవ్వాలనుకుంటున్నాను. పిల్లలు పుట్టిన తర్వాత పని వదిలేసి వారికే పూర్తి సమయం కేటాయించాలనుకుంటున్నాను’ అని తెలిపారు.

చివరి సినిమా చైతూతో… సమంత సినిమాలకు దూరం కావడానికి ముందు తన భర్త నాగ చైతన్య కలిసి ఓ సినిమాలో కలిసి నటించడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి శివా నిర్వాణ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. బహుషా సమంత చేసే చివరి సినిమా ఇదే కావొచ్చు.